కార్పొరేట్ కళాశాలల తీరు వల్ల ఎంతో మంది విద్యార్థులు బలైపోతున్నారని ఏబీవీపీ కోఠీ జిల్లా కన్వీనర్ సభావట్, కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల మృతిపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.