మహారాష్ట్రలోని వార్దాలో ఓ వ్యక్తి మైనర్ భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో ఆమె అతనిపై అత్యాచారం కేసు పెట్టింది. కాగా, నిందితునికి కోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను ధర్మాసనం సమర్థించింది. అంగీకారం ఉన్నా కూడా మైనర్ భార్యతో భర్త శృంగారంలో పాల్గొంటే అత్యాచారమేనని బాంబే హైకోర్టు తీర్పును వెలువరించింది. అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది.