పేద, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బుధవారం అన్నారు. నారాయణపేట పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. సంవత్సర కాలంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సంకల్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున ప్రజాపాలన ప్రజల విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.