ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డయాబెటిక్ దినోత్సవం సందర్బంగా గురువారం నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత డయాబెటిక్ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఐఎంఎ జిల్లా అధ్యక్షులు డా. వై మల్లికార్జున్, కార్యదర్శి డా. ప్రసాద్ శెట్టి, కోశాధికారి డా. గీత బుధవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.