పోలీస్ డ్రైవర్లు డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా వుండాలని ఆర్ఎస్ఐ శివశంకర్ అన్నారు. మంగళవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో పోలీస్ మోటార్ వాహనాల డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పారు. వాహనాలు ఎల్లప్పుడూ కండిషన్ లో పెట్టుకోవాలని, వాహనాలను సొంత వాహనాలుగా భావించాలని సూచించారు.