నారాయణపేట డిఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిఎస్పీ లింగయ్య బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. బాధితులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఎస్పీ యోగేష్ ఆదేశాల మేరకు ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించామని, మొత్తం అయిదు ఫిర్యాదులు అందినట్లు చెప్పారు.