గర్భిణులు, చిన్నారులకు ప్రాణాంతక వ్యాధులు రాకుండా వందశాతం టీకాకరణ లక్ష్యాన్ని సాధించాలని డీఎంహెచ్ఓ డా. స్వరాజ్యలక్ష్మి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో బుధవారం జిల్లాలోని వైద్యాధికారులు, పర్యవేక్షణ సిబ్బందికి టీకాకరణపై వర్క్ షాప్ నిర్వహించారు. పుట్టిన చిన్నారి నుంచి 16 ఏళ్ల వరకు 12 ప్రాణాంతక వ్యాధుల నివారణకు వ్యాధి నివారణ టీకాలు వేయాలని సూచించారు.