పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతం తెలిపారు. విచక్షణతో కూడిన మొబైల్ వాడకం, రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో విద్యార్థి పాత్ర అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. వ్యాసరచన పోటీల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు.