ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు బుధవారం పోగొట్టుకున్న ఫోన్ను ఎస్ఐ నరేందర్ బాధితుడికి బుధవారం అందజేశారు. ది వర్కర్ నియోజకవర్గ మదనాపురం మండలం దంతనూరు గ్రామానికి చెందిన కే. కిరణ్ కుమార్ మే 1 న ఆత్మకూరుకు బైక్ పై వచ్చిన సందర్భంలో ఫోన్ ను పోగొట్టుకున్నారు. ఇట్టి విషయంపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు సీఈఐఆర్ అప్లికేషన్ ట్రేస్ ద్వారా పరిశీలించి ఫోన్ స్వాధీనం చేసుకొని, బాధితుడికి అప్పగించారు.