మహబూబ్ నగర్: రెండు రోజులు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం

59பார்த்தது
మహబూబ్ నగర్: రెండు రోజులు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం
మహబూబ్ నగర్ నుండి చించోలి వరకు ఎన్ హెచ్ 167 రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆదివారం వికారాబాద్ మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చలమారెడ్డి తెలిపారు. మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల గేటు చౌరస్తా దగ్గర 250 ఎంఎండిఐ పనులు జరుగుతుండడంతో గండీడ్ మండల పరిధిలో ఉన్న 33గ్రామాలకు సోమవారం మధ్యాహ్నం నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు నీటి సరఫరా ఉండదన్నారు.

தொடர்புடைய செய்தி