రైతుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ, మద్దతు ధర, బోనస్ చెల్లించిన సందర్భంగా ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రైతు పండుగ నిర్వహించనున్నట్లు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించి ఈనెల 28, 29, 30వ తేదీలలో వ్యవసాయ ఎగ్జిబిషన్, ఆధునిక పద్ధతులు, ఆదర్శ రైతులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.