గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ పరీక్ష ఒకే రోజు ఒకే ప్రశ్నపత్రంతో పాత పద్ధతిలో నిర్వహించారని, రేవంత్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని గద్వాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్. రామచంద్ర రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. టెట్ పరీక్షను రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందికరంగా నిర్వహిస్తోందని తెలిపారు.