మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ కేసులో బలమైన ఆధారాలు ఉన్నాయని మహబూబ్ నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్ శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. క్రిస్టియన్పల్లిలోని సర్వే నంబర్ 523 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో ఫోర్జరీ పట్టాల కేసులో శ్రీకాంత్ గౌడ్ ఏ4 నిందితుడని అన్నారు. శ్రీకాంత్ గౌడ్ కేసు విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తున్నట్లు సీఐ గాంధీనాయక్ స్పష్టం చేశారు.