మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం, రూ. 5.5 కోట్ల ఆస్తి నష్టం (వీడియో)

52பார்த்தது
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. లాతూరు జిల్లా ఔసాలోని MIDC ప్రాంతంలో హిందూస్థాన్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ గ్రాన్యువేల్ ఉత్పత్తి యూనిట్‌లో మంగళవారం రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో రూ.5.5 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.
Job Suitcase

Jobs near you