ణిపూర్లో స్వల్ప
భూకంపం సంభవించింది. ఉక్రుల్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.3 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. ఉక్రుల్కు 13 కి.మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అర్ధరాత్రి భూమి కంపించడంతో స్థానిక ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.