AP: తూర్పుగోదావరి జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. డయాలసిస్ కోసం కాకినాడ జీజీహెచ్‌కు వచ్చిన శిరీష(34) అనే రోగికి 'O' పాజిటివ్‌కు బదులు హౌస్ సర్జన్ 'AB పాజిటివ్' రక్తం ఎక్కించారు. ఈ క్రమంలో శిరీష వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ఆసుపత్రిలోనే మరణించింది. దీంతో ఆసుపత్రి వర్గాలు బాధితురాలి కుటుంబసభ్యులకు నష్టపరిహారంగా రూ.3 లక్షల చెక్కును అందించి చేతులు దులిపేసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.