రక్షణ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్ నవంబర్ 1వ తేదీన ఢిల్లీ సౌత్ బ్లాక్‌లో బాధ్యతలు చేపట్టారు. కేరళ కేడర్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆర్‌కే సింగ్ ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీ రక్షణశాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా బాధ్యతలు స్వీకరించారు. 2023 ఏప్రిల్ 24 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య కాలంలో వాణిజ్య, పరిశ్రమ శాఖలోని అంతర్గత వాణిజ్యం–పరిశ్రమల ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు.