కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ సాయిల్‌ను కర్ణాటక ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషిగా తేల్చింది. రూ.2500 కోట్ల ఇనుప ఖనిజం కుంభకోణంలో దోషిగా ఉన్నట్లు తెలిపింది. రూ.200 కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని అక్రమంగా దోచుకుని.. విదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణలపై సీబీఐ కేసు ఫైల్ చేసి విచారణ జరిపింది. ఆయన ఎండీగా ఉన్న మల్లికార్జున కంపెనీపై పలు సెక్షన్లతో కేసు నమోదైంది. త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.