ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ హత్యకు కుట్ర?

67பார்த்தது
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ హత్యకు కుట్ర?
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు సమాచారం. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించినట్లు దక్షిణ కొరియాకు చెందిన స్పై ఏజెన్సీ.. ఇంటెలిజెన్స్ సర్వీస్ పార్లమెంటరీ ఆడిట్ సెషన్‌లో వెల్లడించింది. కమ్యూనికేషన్ జామింగ్ వాహనాలు, డ్రోన్లతో దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనకు ఉత్తరకొరియా భద్రత పెంచినట్లు తెలిపింది.

தொடர்புடைய செய்தி