TG: సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. కుటుంబ సమేతంగా వెళుతున్న ఆయన.. బుధవారం ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. బుధ, గురువారాల్లో ఢిల్లీలోనే ఉంటున్న సీఎం రేవంత్.. కేంద్రమంత్రులను కలిసి వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు.