త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని చైనా ప్రభుత్వం యువతీ యువకులను వేడుకుంటోంది. దేశంలో జననాల రేటు పడిపోవడం, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రభుత్వం ఇలా బతిమాలుడుకుంటోంది. అలాగే
ఉద్యోగాలు చేస్తున్న వారిని ఆలస్యంగా రిటైర్ కావాలని కూడా కోరుతోంది. యుక్త వయసులోనే యువతీ యువకులకు వివాహాలు చేయించేందుకు నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.