హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రభత్వ ఆపరేషన్ పై భాదిత ప్రజలు తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ రోడెక్కారు. ఈ క్రమంలోనే ఆదివారం హైదర్‌షా కోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇళ్ళు కూల్చొద్దు అంటూ ప్లకార్డులతో భాదిత కుటుంబాలలోని చిన్నారులు వారి తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలిపారు. దయచేసి మా ఇళ్ళను కూల్చకండి, మా పేరెంట్స్‌ని చూస్తుంటే బాధగా ఉందని ఆ చిన్నారులు ప్రభుత్వాన్ని కోరారు.