ఐటీ చట్టం మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను హెచ్చరించింది. ఐటీ చట్టం-2021లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అశ్లీల కంటెంట్ గురించి ఫిర్యాదులు వచ్చాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిందని గుర్తు చేసింది.