ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రాలకు ప్రత్యేక సాయం కింద తొలివిడతగా ఏపీకి రూ.113 కోట్లు విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులను ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి వినియోగించనున్నారు. అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.