రైల్వే అండర్‌ బ్రిడ్జిలో నీట మునిగిన కారు.. ఇద్దరు మృతి (వీడియో)

84பார்த்தது
హర్యానాలోని ఫరీదాబాద్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద మహీంద్రా XUV-700 కారు వర్షపు నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మేనేజర్ పుణ్యశ్రే శర్మ, క్యాషియర్ విరాజ్ మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி