హైదరాబాద్‌లోని మణికొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం తానేషా నగర్‌లో ఓ స్కూటీను ఢీ కొట్టడంతో స్కూటీపై వెళ్తున్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.