ఆదిలాబాద్‌లో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఇందిరానగర్‌లో సోమవారం అర్ధరాత్రి రవితేజ (30) అనే యువకుడిని దుండుగులు కత్తితో పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో వివరాలు సేకరిస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.