తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు(ఆదివారం) ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని క్సూచినచ్చింది.