కాగజ్ నగర్: అలయ్ బలయ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

50பார்த்தது
కాగజ్ నగర్: అలయ్ బలయ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే
కాగజ్ నగర్ పట్టణంలోని పద్మశాలి భవన్లో సోమవారం దసరా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్, సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, చేనేత చేతివృత్తులను అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు డా. ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி