ఆర్జీయూకేటీ బాసరలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ ఆదేశాల మేరకు పరిపాలన భవనం కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏవో రణధీర్ సాగి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యమానికి ఊపిరి పోసిన మహనీయుడని మూడు దశల్లో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పనిచేశారని కొనియాడారు.