ఆసుపత్రిలో పసికందు మృతి.. వైద్యులే కారణం అంటున్న బంధువులు

64பார்த்தது
బైంసాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసికందు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కుబీర్ మండలంలోని రాజురా కు చెందిన ఓ గర్భిణీ పురిటి నొప్పులతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురాగా పండంటి ఆడపిల్లను ప్రసవించిందనీ, బరువు తక్కువగా ఉండడంతో ఎన్ఐసియులో ఉంచారని శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిందని వాపోయారు. శిశువు మృతికి డాక్టర్ తో పాటు వైద్య సిబ్బంది కారణమని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி