హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత కొనసాగుతోంది. 20 గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ 148 మీటర్ల క్రస్ట్ లెవల్ కు 147. 95 మీటర్ల నీటిమట్టం ఉండగా, మొత్తం 20. 175 టీఎంసీలకు గాను 20. 100 నీటి నిలువ ఉంది. ఇన్ ఫ్లో కింద ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1. 35 లక్షల క్యూసెక్కుల వరకు వరద వస్తుందని తెలిపారు.