జన్నారం మండలం చెరకుగూడెంకు చెందిన కట్లకుంట రాజన్న(42), ముల్కల రవిలు గురువారం దండేపల్లి మండలం పెద్దయ్య దేవుని గుట్టకు మొక్కు తీర్చుకోడానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పైడిపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడడంతో రాజన్న అక్కడికక్కడే మృతి చెందాడు. రవికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎస్సి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.