సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం బీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బిజెపి సభ్యత్వంలో పాల్గొని వేగవంతం చేయాలని మండల నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత అందరిపై ఉందన్నారు.