ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువుకులు అత్యవసర సమయంలో ఓ బాలింతకు రక్త దానం చేసి తన ప్రాణాలు కాపాడి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా బైంసా కు చెందిన ఓ మహిళా అక్కడి ఆసుపత్రి లో ఆదివారం మధ్యాహ్నం ప్రసవించి మగ శిశువుకు జన్మనిచ్చింది. కాగా ఆ శిశువు రక్త హీనతతో మృతి చెందింది. ఆ బాలింత పరిస్థితి సైతం రక్తహీనతతో విషమించింది ఆమెకు వెంటనే రక్తం అవసరం అవడంతో తెలిసిన వారు బోథ్ కు చెందిన స్థానిక కట్టా యువసేన వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు.
ఈ విషయం గమనించిన స్నేహ డ్రెస్సెస్ కొట్కూరి సాయి, బోగ సాయి అనే ఇద్దరు యువకులు వెంటనే స్పందించి బోథ్ నుంచి 89 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైంసా పట్టణానికి వెళ్లి రక్త దానం చేసి బాలింత ప్రాణాలు కాపాడారు. ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని వారు కోరారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఆ యువకులను మండల ప్రజలు అభినందించారు.