మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు సరిహద్దున అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. లక్ష్మీపూర్, ఘన్ పూర్, కరంజి, ఆనంద్‌పూర్, పిప్పర్ వాడ, శంకర్ గూడా వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మహారాష్ట్రలో కోడ్ ఎత్తేసే వరకు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ల వద్ద నిరంతరం నిఘాను కొనసాగిస్తామన్నారు.