గత కొన్ని రోజులుగా ఇచ్చోడ మండల కేంద్రంలో కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని టీజీవీపీ బోథ్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల నరేందర్ యాదవ్ ఆరోపించారు. రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. త్వరగా రోడ్డు పనులు పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.