కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలి అని బీఆర్ఎస్ జిల్లా నాయకురాలు కాటిపెళ్లి సునీతారెడ్డి అన్నారు. ఆదివారం తలమడుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ. కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు రూ. 2500, కల్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. వెంటనే హామీలను లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామన్నారు.