బోథ్ మండల విద్యాధికారిగా కుమ్మరి పోశెట్టి నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన బోథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో పీజీహెచ్ఎం విధులు నిర్వహిస్తున్నారు. ఇదివరకు ఎంఈఓ గా విధులు నిర్వహించిన పోశెట్టి ఇటీవల పదవీ విరమణ పొందడంతో ఎంఈఓ పోస్టు ఖాళీ అయింది. దీంతో విద్యాశాఖ డైరెక్టరేట్ నుండి కే. పోశెట్టి ని మండల విద్యాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.