ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయ భవనాలు అసాంగిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇటీవల నూతనంగా నిర్మించిన ప్రభుత్వ కార్యాలయ భవనాలు ప్రారంభానికి నోచుకోక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. రిజిస్టర్ కార్యాలయ భవనం, పాత ప్రభుత్వ కళాశాల భవనం, పాత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలు రాత్రుల్లో మందు బాబులకు అడ్డాగా మారాయి. దీంతో భవనాల ఆవరణలు మద్యం సీసాలతో నిండిపోతున్నాయి. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.