ఊత్తర ప్రదేశ్ రాష్ట్రంలో హతరాజ్ జిల్లాలో ఒక దళిత బాలిక ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బోథ్ మండలం సోనాల గ్రామ అంబేద్కర్ యువజన సంఘం యువకులు డిమాండ్ చేశారు. బాలిక ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ బుధవారం రాత్రి అంబేద్కర్ కాలనీ లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కాలనీ వాసులు మంగలిపెళ్లి రాజశేఖర్, ప్రశాంత్, అనిల్, రాజలింగు,ప్రవీణ్, హరీష్, లక్ష్మణ్, శ్రీకాంత్, ముక్తానంద, తదితరులు పాల్గొన్నారు.