ఓ మెకానిక్ టైర్ రిపేర్ చేస్తుండగా.. ఒక్కసారిగా టైర్ పేలడంతో ఆ వ్యక్తి గాల్లో ఎగిరిపడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగినట్లు తెలుస్తోంది. షెడ్డుకు వచ్చిన టైరుకు రిపేర్ చేసి.. మెకానిక్ అందులో గాలి నింపుతున్నాడు. అయితే ఆ టైర్ ఊహించని విధంగా పేలింది. దాంతో ఆ మెకానిక్ గాల్లో ఎగిరిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అప్రమత్తంగా ఉండకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.