హైదరాబాద్‌లో ఇటీవల కల్తీ ఆహారాలు భారీగా పట్టుబడుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను అధికారులు పట్టుకున్నారు. మొత్తం 15 టన్నుల అల్లం వెల్లుల్లి పేస్టుని పట్టుకున్నట్టు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ దందా నిర్వహిస్తున్న ఆసిమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ప్రమాదకరమైన రసాయనాలు కలిపి తయారు చేస్తున్నట్టు గుర్తించారు.