Feb 01, 2025, 00:02 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి: సస్పెండ్ ఉత్తర్వులు అందుకొని కింద పడిపోయిన హెచ్ ఎమ్
Feb 01, 2025, 00:02 IST
ఎల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో పాఠశాల హెచ్ఎం మాణిక్యంను బాధ్యులు చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు గురువారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేశారు. ఇట్టి ఉత్తర్వుల విషయాన్ని ఎంఈఓ వెంకటేశం ఎంఆర్సి కార్యాలయం వద్ద హెచ్ఎంకు చెప్పారు. ఆయనకు బీపీ పెరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.