పులివెందులలో ఎటు చూసినా ఆసంపూర్తి పనులే కనిపిస్తున్నాయి. ఏ రోడ్డుకు వెళ్లిన గుంతలు, మిట్టలే దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా మ్యాన్ హోల్లు పగిలిపోయి ఉండడం, ఓపెన్ గా ఉండడమే జరుగుతోంది. వీటికి నిధులు కేటాయించి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలైన బ్రాహ్మణపల్లె, పెద్దరంగాపురం, చిన్న రంగాపురం గ్రామాల పరిస్థితి మరి అధ్వానంగా ఉన్నాయని మంగళవారం స్థానికులు ఆరోపిస్తున్నారు