మాలమహానాడు నేతలు గృహ నిర్బంధం
అంబేద్కర్ ఫ్లెక్సీని చించేసిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేయకుండా తమను హౌస్ అరెస్టు చేయడం దారుణమని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ అన్నారు. ఆచంట మండలం వేమవరంలోని శనివారం నివాసం వద్ద ఆయన మాట్లాడారు. చలో ఏలూరుపాడుకు పిలుపునిస్తే అధికారులకు అంత భయమెందుకని అన్నారు. నిత్యం పోలీసులు ఈవిధంగా వచ్చి నిర్బధించడం సరికాదన్నారు.