తాడేపల్లిగూడెం: షేక్ సాబ్జీ కర్తవ్యాలను ముందుకు తీసుకెళ్తాం
పూర్వపు ఎమ్మెల్సీ స్వర్గీయ షేక్ సాబ్జీ కర్తవ్యాలను ముందుకు తీసుకెళ్తామని ఉపాధ్యాయ శాసనమండలి ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం పట్టణం, రూరల్ మండలంలో పర్యటించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఉపాధ్యాయుల సమస్యలపై పనిచేస్తానన్నారు. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.