కాల్ మనీపై ఏలూరు జిల్లా పోలీసుల ఉక్కుపాదం
ఏలూరులో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసులో ప్రధాన నిందితుడు సుధాకర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మీడియాతో వివరాలు వెల్లడించారు. గత కొద్దిరోజుల క్రితం అదే కేసులో మేడపాటి సుధాకర్ రెడ్డి, అల్లాడి లావణ్య, రాజేష్, లను అరెస్టు చేశాం, మరలా కస్టడీకి తీసుకొని విచారిస్తామన్నారు. ఇప్పటివరకు వీరిపై ఏడు కేసులు నమోదు చేశామన్నారు.