విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హైనాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం HU438 ఇటలీలోని రోమ్ నుంచి చైనాలోని షెన్జెన్కు వెళ్తోంది. టేకాఫ్ సమయంలో కుడి ఇంజిన్‌పై పక్షి దాడి చేసింది. దీంతో ఇంజన్ ఫెయిల్యూర్ అయింది. మిడ్-ఎయిర్‌లోకి వెళ్లగానే మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ తిరిగి రోమ్‌కి తీసుకొచ్చి సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు.