బేస్ లైన్ పరీక్ష ఆధారంగా విద్యార్థులకు చదవడం రాయడం లో తర్ఫీదు నివ్వండి

459பார்த்தது
బేస్ లైన్ పరీక్ష ఆధారంగా విద్యార్థులకు  చదవడం రాయడం లో తర్ఫీదు నివ్వండి
నిడమర్రు మండలం భువనపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలను కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శ్రీ వెంకటేశ్వరరావు శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. విద్యార్థులను తెలుగు ఆంగ్లము లెక్కలు మూడు సబ్జెక్టులలో ప్రశ్నలు వేశారు. 6 7 తరగతులను సందర్శించారు .అనంతరము పాఠశాల ఉపాధ్యాయుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి లెసన్ ప్లాన్ మరియు టీచర్ డైరీ పరిశీలించారుఉపాధ్యాయులందరూ విధిగా లెసన్ ప్లాన్ డైరీ నిర్వహించాలని తెలియజేశారు. అందరూ ఉపాధ్యాయులు డైరీ లెసన్ ప్లాన్ కలిగి ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బేస్ లైన్ పరీక్ష పూర్తయినందున వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా ఉపాధ్యాయులను కోరారు చదవటం రాయడం అనేది ప్రాథమిక అవసరం కనుక వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలు కంటే ఆ అంశాల పైన ప్రత్యేక తర్ఫీదు అవసరమని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని ఉన్నత అధికారుల ఆలోచనను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు ఎవరికి వారు తగు జాగ్రత్తగా పాఠ్యాంశ బోధన చేయాలని నియమావళి పాటించాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్ పెద్దిరాజు, పి. నరసింహమూర్తి, ఆర్ తులసి లక్ష్మి, కె హేమలత పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி